మొత్తం మీద కమల్ హాసన్ కదిలాడు .. విశ్వరూపం 2 ట్రైలర్

కమలహాసన్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ‘విశ్వరూపం’ ఒకటిగా కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆయనకి సంచలన విజయాన్ని అందించింది. దాంతో ‘విశ్వరూపం 2’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కమల్ ప్రయత్నించాడు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది.
 అయితే ఎలాగైనా ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో కమల్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వున్నాడు. ఆ ప్రయత్నాలు ఫలించడంతో ఈ సినిమా విడుదలకి ఆటంకాలు తొలగిపోయాయని అంటున్నారు. కమల్ పుట్టినరోజైన ఈ నెల 7వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ ఎన్ని వ్యూస్ ను తెచ్చుకుంటుందో .. సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here