కలక్షన్స్ దున్నేస్తున్న గరుడ వేగ .. సీక్వెల్ కూడా ?

రాజశేఖర్ .. ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందిన ‘గరుడవేగ’, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీగా వుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు ఇచ్చిన ముగింపు ఈ ప్రచారానికి కారణమైంది.
 తనకి అప్పగించిన మిషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన హీరో, ఆ తరువాత తన ఫ్యామిలీతో కలిసి అకేషన్ కి వెళతాడు. అక్కడతను తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉండగా, ఒక్కసారిగా శత్రువులు చుట్టుముడతారు. ఈ సీన్ పైనే ఎండ్ టైటిల్స్ పడతాయి. కనుక ఇక్కడి నుంచి సీక్వెల్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొనసాగింపు ఉందనే హింట్ ఇస్తూ దర్శకుడు ఈ కథను ఇక్కడ ముగించాడని చెబుతున్నారు. ఈ విషయంపై దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here