కాబోయే ఆడపడుచుకు ధన్యవాదాలు తెలిపిన కాజల్..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా కాజల్ అగర్వాల్ స్వయంగా తన అభిమానులతో పంచుకుంది. దీంతో కాజల్ కు సినిమా ఇండస్ట్రీతో పాటు, సన్నిహితులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కాజల్ కాబోయే వరుడు గౌతమ్ కిచ్లు సోదరి.. గౌరీ కిచ్లు నాయర్ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కాజల్, గౌతమ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన గౌరీ.. కాజల్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన కాజల్. మీరు చేసిన పోస్టుకు.. ధన్యవాదాలు సిస్టర్ అంటూ క్యాప్షన్ ను జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.. కాజల్ అగర్వాల్ కు పెళ్లి కళ వచ్చేసింది అంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ఇక కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30న ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here