గెస్ట్ రోల్ కోసం రూ. 70 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన హీరోయిన్ !!

హీరోయిన కాజ‌ల్ అగ‌ర్వాల్ మంచి ఫామ్‌లో ఉంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి సీనియ‌ర్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయినా ఇంకా బిజీగానే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ‌.

హీరో ఎవ‌రైనా స‌రే.. పాత్ర హీరోయిన్ అయినా లేక‌, గెస్ట్ రోల్ అయినా, లేక ఐటం సాంగ్ అయినా కాజ‌ల్ త‌ప్ప‌కుండా న‌టిస్తుంది. అంద‌రితో న‌టించ‌డం కాజ‌ల్‌కు అల‌వాటైపోయింది. ఇప్పుడు ఇదే కాజ‌ల్ కెరీర్‌కు మంచి ప్ల‌స్ పాయింట్ అవుతోంది. హీరోయిన్ గా బిజీగా ఉంటూనే అప్పుడ‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న గెస్ట్ రోల్‌ల్ న‌టిస్తున్నారు కాజ‌ల్‌.

తాజాగా హీరో రానా న‌టిస్తున్న హాథీ మేరే సాథీ తెలుగులో అర‌ణ్య పేరుతో రానున్న‌ చిత్రంలో కాజ‌ల్ న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సినిమాలో కేవ‌లం అర‌గంట సేపు మాత్ర‌మే కాజ‌ల్ రోల్ ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే దీని కోసం కాజ‌ల్ ఏకంగా రూ. 70 ల‌క్ష‌లు పారితోషికం తీసుకుంటున్న‌ట్లు టాక్‌. సినిమాలో ఆదివాసీ అమ్మాయిలా కాజ‌ల్ క‌నిపించ‌బోతోంది. ఇప్ప‌టికే రానా కాజ‌ల్ నేనే రాజు నేనే మంత్రి సినిమాలో న‌టించారు. మ‌రోసారి ఈ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తోంది. అయితే కాజ‌ల్ కాసేపు మాత్ర‌మే క‌నిపించ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here