మళ్ళీ అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి అరెస్టయ్యారు. వాహనాల అక్రమ రిజిస్టేషన్ కేసులో ఆయన, అస్మిత్ రెడ్డిలు గురువారం కండిషన్ బెయిల్ పై విడుదల అవ్వగా.. నేడు ప్రభాకర్ రెడ్డి మళ్ళీ అరెస్టయ్యారు..

గురువారం వీళ్ళు విడుదలైన సందర్భంగా కడప సెంట్రల్ జైల్ వద్ద కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ సహా 31 మంది టిడిపి కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

కడప జైల్ నుండి తాడిపత్రి వరకు అనుచరగణంతో వచ్చిన వీళ్ళు.. ఓ సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో జేసిపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. లాకెడౌన్ నిబంధనల ఉల్లంఘన కేసు కూడా నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here