అజ్ఞాతవాసి కోసం ఎన్టీఆర్ వస్తాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో  పెను సంచలనాలుసృష్టిస్తోంది. ఇప్పటికేఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ రెండు పాటలను విడుదల చేసి  అజ్ఞాతవాసి చిత్రం మీద అంచనాలు ఆకాశంలో పెట్టాడు.. అలాగే విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నాడు అనే వార్త  ఇది ఈ సినిమాకి అదనపు ఆకర్షణ ఆని చెప్పవచ్చు .

అయితే ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా గురించిన విషయం ఒకటి బయటకు వచ్చింది అదేమిటంటే ఈనెల 19న ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కి  జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడని సోషల్ మీడియాలో వార్త విహరిస్తుంది.అంతేకాకుండా  జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించింది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… తను నెక్స్ట్  చేయబోయే సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో కాబట్టి ఈ మేరకు ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరవుతారని అంటున్నారు. ఇదే గనుక నిజమైతే అభిమానుల మధ్య స్వచ్ఛమైన వాతావరణం నెలకొంటుందని సినీ ప్రేమకులు అంటున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here