ముందు రోజా కి సిగ్గుంటే సారీ చెప్పమనండి – బండ్ల గణేష్ మళ్ళీ అరుస్తున్నాడు

తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోనని సినీన‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై బండ్ల గ‌ణేశ్‌ తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని వైసీపీ మ‌హిళా నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బండ్ల గ‌ణేశ్ మీడియాతో మాట్లాడుతూ… ముందు రోజానే ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై, త‌న‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు.
‘ఒక మ‌హిళా నేత వాడు, వీడు అంటూ మాట్లాడ‌వ‌చ్చా? నాపై రోజా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడ‌డం న్యాయ‌మా? నేను ప్రాణం పోయినా క్ష‌మాప‌ణ చెప్పను. ప‌వ‌న్‌కి రోజా క్ష‌మాప‌ణ చెబితే నేను రోజాకి క్ష‌మాప‌ణ‌లు చెబుతాను. న‌న్ను అరెస్టు చేయాల‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. నేను చేసింది త‌ప్ప‌ని చ‌ట్టంలో ఉంటే నేను చ‌ట్టాన్ని గౌర‌విస్తాను. రోజాగారు నోరు జారారు కాబ‌ట్టే నేను అలా మాట్లాడాను’ అని బండ్ల గ‌ణేశ్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here