రజినీకాంత్ మళ్ళీ డైరెక్షన్

సూపర్ స్టార్  రజనీకాంత్ అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్  తనలో అనేక షాడోస్ ని ఇప్పటికే బయట పెట్టాడు.   హీరో, సింగర్, దర్శక నిర్మాతగాను సిని ప్రేక్షకులను అలరించాడు.ధనుష్ దర్శకత్వం వహించిన ‘పా పాండి’ సినిమా ధనుష్ కి మంచి  విజయాన్ని అందించింది. దర్శకుడిగా ధనుష్  అభిరుచికి మంచి పేరు తెచ్చిపెట్టింది.ఇప్పుడు తాజాగా మరొకసారి  హీరో ధనుష్  దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ సినిమాను  శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు , ఈ మూవీ లో హీరోగా ధనుష్  నటించడం మరొక విశేషం .

సినిమా కథ మొత్తం స్వాతంత్ర్యం రావడానికి ముందు జరిగే పరిస్థితుల నేపథ్యంలో కొనసాగుతుందట.  ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతూన్నయి..ధనుష్ ప్రస్తుతం రజనీతో ‘కాలా’ సినిమాను నిర్మిస్తున్నాడు అలాగే ధనుష్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి ఒకటి గౌతమ్ మీనన్ డైరెక్ట్ర్  కాగా మరొకటి వెట్రిమారన్ దర్శకత్వంలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here