ఇంతకంటే గొప్ప పుట్టిన రోజు ఉండదు – ఎన్టీఆర్

పుట్టిన రోజు సందర్భంగా అతను చేసిన ఒక ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తన కొడుకు అభయ్ రాం , భార్య ప్రణతి లతో ఎన్టీఆర్ దిగిన ఫోటో చాలా వైరల్ అవుతోంది ఆన్ లైన్ లో. ‘నా తొలి, ఎంతో విలువైన బర్త్ డే విషెస్ ఆఫ్ ది ఇయర్’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. తన కొడుకుని భుజాల పైన ఎక్కించుకున్న ఫోటో బాగా వైరల్ అవుతూ ఉండడం విశేషం.

అతనితో పాటు తన భార్య కూడా ఉంది ఇద్దరూ సేల్ఫీ దిగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా అభిరాం అల్లరి చేస్తున్నాడు ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ‘ఫ్యామిలీ టైమ్! అభయ్ ప్రేమతో నా కళ్లు ఎందుకు మూసాడో నాకు తెలియదు’అని మరో ట్వీట్ లో యంగ్ టైగర్ పేర్కొన్నాడు. కాగా, జూనియర్ బర్త్ డే సంద్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here