యూపీ సీఎంతో జ‌య‌ప్ర‌ద భేటి రాజ‌కీయాల కోస‌మేనా..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్‌ని సినీన‌టి, మాజీ పార్ల‌మెంటు స‌భ్యురాలు జ‌య‌ప్ర‌ద క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంచ‌రించుకుంది. ప్ర‌స్తుతం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో నెల‌కొన్న ప‌రిస్థితులు అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో మ‌హిళా నాయ‌కురాలు యోగి క‌ల‌వ‌డం గురించి అంతా చ‌ర్చించుకుంటున్నారు.

జ‌య‌ప్ర‌ద సినీ రంగంలోనే కాకుండా రాజ‌కీయాల్లో కూడా రాణించారు. 2019లో ఆమె భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. అయితే ఆమె యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌ను క‌ల‌వ‌డంతో రాజ‌కీయ గురించే చ‌ర్చించార‌ని తెలుస్తోంది. అయితే ఆమె మాత్రం రామ్ పూర్ అభివృద్ధి గురించి యోగితో చ‌ర్చించిన‌ట్లు చెబుతున్నారు. లాల్ పూర్ వంతెన స్థానికుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌ని అందుకే దీనిపై సీఎంతో క‌లిసి మాట్లాడాన‌ని చెప్పారు. అభివృద్ధి విష‌యంలో సీఎం సానుకూలంగా స్పందించిన‌ట్లు ఆమె తెలిపారు.

రాంపూర్ జిల్లాలోని సురా అసెంబ్లీకి జ‌రిగే ఉప ఎన్నిక‌ల గురించి వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. సురా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల‌ని జ‌య‌ప్ర‌ద భావిస్తున్నారంట‌. స్థానిక ఎమ్మెల్యే త‌ప్పుడు డాక్యుమెంట్లు ఎన్నిక‌ల అఫిడ‌విట్లో స‌మ‌ర్పించార‌న్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కేసు కోర్టు ప‌రిదిలో ఉంది.  మ‌రి దీనికోసం ఏమైనా ప్ర‌ధానంగా ఈ భేటిలో ప్ర‌స్తావించారా అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. కాగా తాజాగా హ‌థ్రాస్ ఘ‌ట‌న గురించి కూడా వీరిరువురి మ‌ధ్య సంభాష‌ణ‌లు వ‌చ్చి ఉంటాయ‌ని తెలుస్తోంది. మ‌హిళ‌ల‌పై దాడుల‌ను తీవ్రంగా ఖండించాల‌ని ఆమె చెప్పార‌ని తెలుస్తోంది. ఏదిఏమైనా జ‌య‌ప్ర‌ద యోగిల మీటింగ్‌లో అభివృద్ధితో పాటు రాజ‌కీయ కార‌ణాలు కూడా ఉంటాయ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై స్ప‌ష్ట‌త రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here