అనూహ్య ధరకి జై లవ కుశ సాటిలైట్ హక్కులు

ఎన్టీఆర్ – రవీంద్రా ( బాబీ) డైరెక్షన్ లో వస్తున్న జై లవ కుశ సినిమా మీద ఇప్పటికే బోలెడంత క్రేజ్, హైప్ ఏర్పడిపోయి ఉంది. ఈ సినిమా విడుదల కి సంబంధించి అన్నీ సిద్దం అవుతున్నాయి. రేపు ఈ పాటికి కుశ టీజర్ ని కూడా విడుదల చేసేస్తారు. ఈ నేపధ్యం లో ఎన్టీఆర్ ఫాన్స్ కి మరొక సుభవార్త వినిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ కంటే ముందరే ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్మేసారు నిర్మాతలు. అది కూడా భారీ ధరకి అమ్ముడు పోయాయి అంటున్నారు. జెమినీ టీవీ ఈ సినిమా హక్కులు సొంతం చేసుకుందట. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం లో ఉండడం తో ఈ సినిమా హక్కులకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మా టీవీ , జీటీవీ , జెమినీ ఈ మూడు ఛానల్ వారూ ఈ సినిమా కోసం పోటీ పడినా చివరికి మాత్రం గెలిచింది జెమినీ. అయితే అమౌంట్ ఎంత అనేది మాత్రం సోర్సెస్ నుంచి ఇంకా రాలేదు. ఎన్టీఆర్ మూడు పాత్రలకి సంబంధించిన లుక్స్ కి మంచి మార్కులు పడటం .. టీజర్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం ఈ స్థాయిలో శాటిలైట్ రైట్స్ పలకడానికి కారణమని చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here