జై లవ కుశ ఎక్స్ క్లూజివ్ : సెకండ్ హాఫ్ లో ఆ ఇరవై నిమిషాలూ ఎన్టీఆర్ ఫాన్స్ కి పూనకాలే

హీరో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం లో నటించిన జై లవకుశ చిత్రం ఇప్పుడు విడుదల కి సర్వం సిద్ధం అయ్యింది. ఈ నెల 21 న రాబోతున్న ఈ సినిమా ని బానీ తనదైన స్టైల్ లో తీసాడు అని ఫిలిం నగర్ లో టాక్. ఈ సినిమాకి దేవీ శ్రీ మ్యూజిక్ అందించాడు, కథ ప్రకారం ఈ సినిమా లో నాలుగే నాలుగు పాటలు ఉన్నాయి , కానీ ఫాన్స్ కోసం ఒక కొత్త ఐటెం సాంగ్ ని ప్రవేశ పెట్టారు. తమన్నా – తారక్ స్క్రీన్ మీద కనిపించబోయే ఈ ఐటం సాంగ్ కి దేవీ ఇప్పటికే మ్యూజిక్ ఇచ్చాడట. ఈ పాట ఈ సినిమాలో సరైన టైం లో పడుతుంది అట , అప్పటి దాకా యాక్షన్ ఎపిసోడ్స్ సాగుతూ సాగుతూ ఉన్న టైం లో ఎన్టీఆర్ నుంచి ఒక ట్విస్ట్ రివీల్ ఐన తరవాత తమన్నా తో ఐటెం సాంగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఇంతవరకూ బయటికి వచ్చిన నాలుగు పాటలకంటే ఐదవ పాట అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ యాక్షన్ ఎపిసోడ్ , ఎన్టీఆర్ రివీల్ చేసే ట్విస్ట్ ఆ తరవాత తమన్నా ఐటెం నెంబర్ ఇలా ఇరవై నిమిషాల పాటు ఫాన్స్ కి పూనకాలే అంటున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here