జ‌గ‌న్ టీచ‌ర్స్ డే ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోరు.. ఎందుకంటే

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెద్ద వాళ్ల‌కు ఎంత గౌరవం ఇస్తారో అంద‌రికీ తెలుసు. కులం, మతం తేడా లేకుండా, పెద్ద చిన్నా చూడ‌కుండా అంద‌రినీ గౌర‌విస్తూ ఆయ‌న మాట్లాడుతుంటారు. ఇక టీచ‌ర్స్ డే విష‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక‌త చాలా ఉంది.

జ‌గ‌న్ గురించి తెలిసిన వారెవ‌రైనా టీచ‌ర్స్‌డేని ఎప్ప‌టికీ మ‌ర్చిపోరని చెబుతారు. ఎందుకంటే ఆయ‌న చేస్తున్న సేవ‌లే అందుకు నిద‌ర్శ‌నం. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నుంచే జ‌గ‌న్‌కు గురువుపై అభిమానం పెరిగింద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్సార్ కూడా ఆయ‌న గురువువెంక‌ట‌ప్ప‌కు గుర్తుగా ఓ పాఠ‌శాల‌ను నెల‌కొల్పారు. జ‌గ‌న్ కూడా ఆయ‌న బాట‌లోనే న‌డుస్తున్నారు.

వైఎస్సార్ ఫౌండేష‌న్ పేరుతో జ‌గ‌న్ ఇంగ్లీష్ మీడియం స్కూలును పులివెందుల‌లో స్థాపించారు. ఇది దిగ్విజ‌యంగా న‌డుస్తోంది. ఈ పాఠ‌శాల‌లో పేద విద్యార్థుల‌కు ఉచితంగా విద్య‌ను అంద‌జేస్తున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే వై.ఎస్ జ‌గ‌న్‌కు విద్య పై ఉన్న విలువ‌, గురువులంటే అభిమానం ఎంతుందో చెప్పొచ్చు. అందుకే జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా ఉన్న వారెవ్వ‌రూ గురువుల దినోత్స‌వం వ‌స్తే ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌ను మ‌ర్చిపోలేరు.‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here