ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల షెడ్యూల్‌పై క్లారిటీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అంద‌రూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ది స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోస‌మే. అందుకే దీని గురించి ఏ చిన్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చినా స‌రే వెంట‌నే దాని గురించి శోధిస్తుంటారు. స‌రిగ్గా నేడు అదే జ‌రిగింది.

నేడు సోష‌ల్ మీడియాలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల గురించి ప‌లు క‌థ‌నాలు ప్ర‌చురిత‌మైన‌ట్లు తెలుస్తోంది. దీనిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల షెడ్యూల్‌కు సంబంధించిన స‌మాచారం ఉంద‌ని అంటున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నామినేష‌న్ తేదీలు కూడా ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు పుకార్లు పుట్టించారు. దీంతో క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతున్న త‌రుణంలో నిజంగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అవుతుందా అన్న సందేహం అంద‌రికీ క‌లిగింది.

అయితే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌రు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఎన్నిక‌ల షెడ్యూల్‌కు సంబంధించిన స‌మాచారం మొత్తం నిజ‌మైన‌ది కాద‌న్నారు. తాను ఎటువంటి షెడ్యూల్‌ను జారీ చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే నిజంగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేయాల్సి వ‌స్తే ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ మీడియా స‌మావేశం పెట్టి దీని గురించి స‌మాచారం తెలియ‌జేస్తారు. గ్రామాల్లోని ప్ర‌జ‌లు, వివిధ పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఇలాంటి ఫేక్ న్యూస్‌లు న‌మ్మ‌కుండా నిజానిజాలేంటో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here