జ‌గ‌న్ అలా చెప్పాడు.. ఇప్పుడు ఇలా అయ్యింద‌న్న లోకేష్‌.. ఓన్లీ ట్విట్ట‌ర్

దేశంలో క‌రోనా క‌ట్ట‌డిలో ఏపీ ప్ర‌భుత్వం ముందు వ‌రుస‌లో ఉంద‌ని అంద‌రూ అంటుంటే తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు మాత్రం ఇది న‌చ్చ‌డం లేదు. అందుకే అధికార పార్టీపై అర్థం లేని వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లోకెక్కాల‌ని చూస్తున్నారు. తాజాగా ట్విట్ట‌ర్‌కే ప‌రిమిత‌మైన లోకేష్ పెట్టిన పోస్టు ఇందుకు నిద‌ర్శ‌నంగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

క‌రోనా విష‌యంలో లోకేష్ ఏమన్నారంటే క‌రోనా ఎక్కువ‌గా ఉన్నా ప్ర‌భుత్వం ఇంకా నిర్లక్ష్యంగానే ఉంద‌న్నారు. క్వారంటైన్లో క‌రోనా బాదితులు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. క‌రోనా పెద్ద విష‌యం కాదంటూనే ఆరున్న‌ర లక్ష‌ల మంది దీని బారిన పడేలా కార‌ణ‌మ‌య్యార‌ని పేర్కొన్నారు. బ్లీచింగ్ చల్లితే చచ్చిపోతుంది, పేరాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి 5,506 మంది చావుకి జ‌గ‌న్ కార‌ణం అయ్యార‌ని లోకేష్ అన్నారు.

కాగా ఇప్ప‌టికే దేశంలో అత్య‌ధిక సంఖ్య‌లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డ‌మే కాకుండా నివార‌ణ చర్య‌లు తీసుకోవ‌డంలో ఏపీ ముందంజ‌లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిట‌ల్స్‌లో క‌రోనా విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో జ‌గ‌న్ స్ప‌ష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడిప్పుడే క‌రోనా కేసుల సంఖ్య కంటే రిక‌వ‌రీ రేటు పెరుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్ని ఆందోళ‌న‌లోకి నెట్టేసి భ‌య‌పెట్టేలా ఉన్నాయ‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి లోకేష్ కామెంట్స్‌పై వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇటీవల చంద్ర‌బాబు జూమ్ వీడియోల‌కు ప‌రిమిత‌మైతే, లోకేష్ ట్విట్ట‌ర్ దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌న్న వాద‌న ఎక్కువ‌గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here