క‌రోనా టీకా తీసుకుంటున్న ప‌బ్లిక్‌.. ప్ర‌క‌టించిన ర‌ష్యా..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ టీకాను ర‌ష్యా త‌యారుచేసిన విష‌యం తెలిసిందే. ఈ ర‌ష్యా టీకా పేరును స్నుతిక్ విగా పెట్టారు. ప్రస్తుతం ఈ టీకా మూడో ద‌శ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఇప్ప‌టికే ఈ టీకాను దేశ వ్యాప్తంగ పంపిణీకి సిద్ధం చేశామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది.

తాజాగా ర‌ష్యా ఆరోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తాము త‌యారు చేసిన స్నుతిక్ వి టీకాను ప్ర‌జ‌లు తీసుకుంటున్నారు. దీన్ని దేశంలోని అన్ని ప్రాంతాల‌కు పంపించేశామ‌ని ఆ దేశం పేర్కొంది. ప్ర‌జ‌లు దీన్ని తీసుకుంటున్నార‌ని పేర్కొంది. ఇప్ప‌టికే 27వేల డోసులు అందుబాటులో ఉన్నాయి. ర‌ష్యా దేశ వ్యాప్తంగా 3 కోట్ల డోసులు మాత్ర‌మే త‌యారు చేస్తోంది. మిగ‌తా దంతా ఇత‌ర దేశాల ఒప్పందంతో త‌యారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ర‌ష్యా టీకాను బ‌హిరంగ మార్కెట్లో అమ్ముతుండ‌టంతో అక్క‌డ ప‌రిస్థితులు ఏ విధంగా ఉన్నాయోన‌ని ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. అయితే ముందుగా ఈ టీకాను ఆరోగ్య సిబ్బందికి ఇచ్చేందుకు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే 120 కోట్ల డోసులు బుకింగ్ కోసం వచ్చిన‌ట్లు తెలుస్తోంది. 20 దేశాలు ఇందుకోసం క్యూ క‌ట్టిన‌ట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here