చంద్ర‌బాబు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది..

ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుంద‌ని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లాలో జ‌రిగిని బీసీల స‌మావేశంలో పాల్గొన్న ఈయ‌న చంద్ర‌బాబు , ఆయ‌న కుమారుడు లోకేష్ బాబు గురించి మాట్లాడారు.

ఏపీలో చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌న్నారు. హైద‌రాబాద్‌లో ఉండి విశ్రాంతి తీసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం హైద‌రాబాద్‌లోనే ఉంటున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న వీడియోల ద్వారా ప్ర‌సంగాన్ని పంపుతూ.. జూమ్ మీటింగుల్లోనే మాట్లాడుతున్నారు. దీనిపై ఇత‌ర పార్టీల నేత‌లు వ్యంగంగా మాట్లాడుతున్నారు. చంద్ర‌బాబు ఏపీలో పార్టీని న‌డుపుతూ తెలంగాణాలో ఉండి గైడ్ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉండి పార్టీని న‌డిపించి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌కుండా ప‌క్క రాష్ట్రంలో ఉండి మాట్లాడ‌టం పార్టీకి బ్యాడ్ నేమ్ తెస్తుందన్నారు.

ఇక లోకేష్ గురించి మంత్రి మాట్లాడుతూ ట్రాక్ట‌ర్ స్టీరింగ్ వ‌దిలేసి ప్ర‌జ‌ల్లోకి పోనివ్వ‌బోయార‌న్నారు. పార్టీ ప‌రిస్థితి కూడా అంతే అని ఎద్దేవా చేశారు. ఇక బీసీల‌కు పెద్ద పీట వేసింది వైసీపీనే అన్నారు. ప్ర‌సంగంలో ఆయ‌న జ‌గ‌న్ను పొగిడారు. ఇక మొత్తానికి లోకేష్ ట్రాక్ట‌ర్ ప‌ర్య‌ట‌న ఇంకా జ‌నాల్లో డిస్క‌ష‌న్ వ‌స్తూనే ఉంది. వ‌ర్షాల కార‌ణంగా పంట‌లు న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు లోకేష్ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌న విష‌యం తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు ఆయ‌న కుమారుడు లోకేష్‌ను హైలెట్ చేసేందుకు ప్ర‌జ‌ల్లోకి పంపార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here