ఐటీ ఉద్యోగుల‌కు భారీ షాక్‌..?

Let me think. Serious female office worker wearing smart watches putting hand on the temple while sitting at workplace

ఐటీ ఉద్యోగుల‌కు భారీ షాక్ త‌గిలేట‌ట్లు ఉంది. ఇన్నాళ్లూ ఇంటి వద్ద‌నే ఉన్న ఉద్యోగుల‌కు పలు కంపెనీల‌కు తీసుకునే నిర్ణ‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని తెలుస్తోంది.

క‌రోనా లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను ఇంటి వ‌ద్ద నుంచే ప‌ని చేయించుకున్నాయి. ఇందులో ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఉద్యోగులంతా ఆరోజు నుంచి సొంతూళ్ల‌కు వెళ్లి ఇంట్లో నుంచే వ‌ర్క్ చేస్తున్నారు. అయితే ఇదే ప‌రిస్థితులు క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంద‌రూ అనుకున్నారు.

వ్యాక్సిన్ వ‌చ్చి దేశ వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ఇంకా ఆరు నెల‌లు పైగానే ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో అంత‌వ‌ర‌కు ఇంటి వ‌ద్ద నుంచే ప‌నిచేస్తార‌ని అంతా అనుకుంటుండ‌గా కంపెనీలు ఉద్యోగుల వేత‌నాల్లో కోత విధించేందుకు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా వీఎమ్‌వేర్‌ ఇన్‌ అనే ఐటీ కంపెనీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలనుకునే వారికి ఉద్యోగుల వేతనాలలో కోత ( 18శాతం) విధించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది.

అయితే ఇందులో నిజ‌మెంతో తెలియ‌దు. దీనిపై ఎలాంటి అధికారిక స‌మ‌చారం ఇంత‌వ‌ర‌కు రాలేదు. ఇకఫేస్‌బుక్ దీనిపై స్పందించింది. ప్రాంతాల‌ను బ‌ట్టి వేత‌నాల‌లో కోత‌లు ఉంటాయ‌ని వెల్ల‌డించింది. అమెరికా లాంటి ఖ‌రీదైన మ‌హా నగ‌రాలు వ‌దిలి వెళ్లి సొంత ప్రాంతాల‌కు వెళ్లే వారికి వేత‌నాల్లో కోత ఉంటుంద‌ని తెలిపింది. మొత్తానికి ఇన్ని రోజులు ఇంటి వ‌ద్దే ఉంటూ ఫుల్ శాల‌రీ తీసుకుంటున్న ఉద్యోగుల‌కు ఈ వార్త‌ల‌తో ఆందోళ‌న మొద‌లైంద‌ని చెప్పొచ్చు. ఒక్క కంపెనీ కోత‌లు విధిస్తే మిగ‌తా కంపెనీలు కూడా అదే దారిలో వెళ‌తాయ‌ని చెప్ప‌లేం. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here