24 మంది ఎంపీల‌కు క‌రోనా..? పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రిగేనా..

రేపు పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం అవ్వ‌నున్న నేప‌థ్యంలో ఓ భారీ షాకింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. పార్ల‌మెంటుకు హాజ‌రుకాబోతున్న 24 మంది ఎంపీల‌కు క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. ప‌లు వెబ్‌సైట్లలో దీనిపై క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి.

పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో ముంద‌స్తుగానే ఎంపీలంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. పాజిటివ్ వ‌స్తే క్వారంటైన్ కు వెళ్లాల‌ని చెప్పారు. పార్ల‌మెంటు హాలులో కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్క రోజులో ఫ‌లితం వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఈ నెల 14వ తేదీన పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ మేర‌కు అధికారులు అన్న ఏర్పాట్లు చేశారు. ఇక క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని చెబుతున్న వారిలో 24 మంది ఎంపీలు, 8 మంది కేంద్ర మంత్రులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో సమావేశాలకు హాజరైన ఎంపీల్లో కలవరం మొదలైంది. ఇక పార్ల‌మెంటులో నిర్వ‌హించ‌బోయే క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ వ‌చ్చిన వారికి స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌నున్నారు. నెగిటివ్ వ‌చ్చిన వారిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here