ప్రభాస్ నిజమైన రాముడు కాదా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ ‘ఆది పురుష్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా… బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వాని నటించనుందని వార్తలు వస్తున్నాయి.

సినిమా ప్రకటించినప్పటి నుంచి.. ఆది పురుష్ చిత్రం రామాయణ నేపథ్యంగా ఉండనుందని. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించనున్నాడని వార్త హల్ చల్ చేస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు రామాయణ ఇతిహాసంతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.

రాముడు, సీత, రావణడు.. కేవలం రామాయణంలోని ఈ మూడు పాత్రల స్ఫూర్తితోనే ‘ఆది పురుష్‌’ పాత్రలు ఉంటాయని వినిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అలనాటి రామాయణాన్ని ఆధునిక రామాయణంగా చూపించబోతున్నారన్నమాట. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చేవరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here