ఎన్టీఆర్ ఆ సినిమా చేయ‌బోతున్నాడా..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా అంటేనే అభిమానుల‌కు పండ‌గ‌లా ఉంటుంది. తార‌క్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ రోజు సంద‌డి మామూలుగా ఉండ‌దు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ఆర్‌.ఆర్.ఆర్‌. స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రాం చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆయ‌న న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే ఇదే స‌మ‌యంలో రానున్న రోజుల్లో ఇంకేం సినిమాలు చేయాల‌న్న దానిపై ఎన్టీఆర్ ఫోక‌స్ పెట్టారు. ప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఒకటి, కేజీయఫ్‌ డైరెక్టర్‌తో మరో సినిమా చేయలనే ఆలోచనలో ఉన్నాడు. సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే ఓ యంగ్ డైరెక్టర్ తన స్క్రిప్ట్‌ని తారక్‌కి వినిపించి ఒప్పించాడనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది `హిట్` సినిమాతో సక్సెస్‌ కొట్టిన డైరెక్టర్‌ శైలేష్ కొలను రీసెంట్‌గా దిల్ రాజుకు ఓ స్క్రిప్ట్ చెప్పాడట. అటుపై దాన్ని ఎన్టీఆర్ వద్దకు తీసుకువెళ్ళారట. స్టోరీ లైన్ తారక్‌కి బాగా నచ్చడంతో బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. ఇప్ప‌టికే అనుకున్న సినిమాల ప్లేస్‌లో ఏ సినిమా లేట్ అయినా వెంటనే ఈ సినిమా చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here