నిధితో ప్రేమలో ఉన్న ఆ టాలీవుడ్‌ హీరో ఎవరబ్బా..?

సినిమా ఇండస్ట్రీలో పుకార్లు.. సర్వసాధారణమైన విషయం. అసలు ఊహకు కూడా అందని పుకార్లు పుట్టుకొస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆ పుకార్లు నిజం కూడా అవుతుంటాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలిబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లు వినడానికి కాస్త ఆసక్తికరంగానూ ఉంటాయి. ఇక ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉందని, ఆ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారని వార్తలు వింటూనే ఉంటాం.

అయితే తాజాగా ఇలాంటి ఓ వార్తే టాలీవుడ్‌ సర్కిల్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న అందాల భామ నిధి అగర్వాల్‌ ప్రేమలో ఉందనేది సదరు వార్త సారాంశం. టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరోతో ఈ అమ్మడు డేటింగ్‌లో ఉందని వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని నిధి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. తాను ఎవరితో డేటింగ్‌లోలేనని చెప్పుకొచ్చింది. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కదా? అని కొందరు వాధిస్తున్నారు. ఇక నిధి అగర్వాల్‌ తెలుగులో ఇప్పటి వరకు హీరో రామ్‌, అఖిల్‌తో కలిసి నటించింది. ఇక ప్రస్తుతం అశోక్‌ గల్లాతో నటిస్తోంది. మరి ఈ అమ్మడు మనసు దోచిన ఆ టాలీవుడ్‌ హీరో ఎవరో తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here