పవన్‌, రానాల సినిమాకు టైటిల్‌ అదేనా..?

రాజకీయాల్లో బిజీగా మారడం వల్ల కొన్ని నెలలపాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు మళ్లీ బిజీగా మారాడు. వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ దూసుకెళుతున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఈ క్రమంలోనే మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనమ్‌ కోషయం’ సినిమా రీమేక్‌లో పవన్‌ నటిస్తున్నాడు. విజయదశమి సందర్భంగా చిత్రాన్ని అధికారికంగా లాంచ్‌ చేశారు. ఈ సినిమాలో పవన్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇక ఇందులో పవన్‌తో పాటు మరో హీరోగా రానా దగ్గుబాటి నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రానాను ఇప్పటికే చిత్ర యూనిట్‌ సంప్రదించారని దానికి రానా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు క్లాసిక్‌ టైటిల్‌ ‘బిల్లా రంగా’ను చిత్ర యూనిట్‌ ఫైనలైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో చిరంజీవి, మోహన్‌బాబు నటించిన సినిమాకు ఇదే టైటిల్‌ ఉండడం విశేషం. దీంతో అన్న టైటిల్‌ను తమ్ముడు వాడుకుంటున్నాడని ఓ చర్చ జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here