క‌శ్మీర్‌లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం.. అడ్డుకున్న పోలీసులు..

క‌శ్మీర్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. క‌శ్మీర్‌లోని లాల్ చౌక్ వ‌ద్ద ఈ ప‌రిస్థితి నెల‌కొంది. లాల్ చౌక్ వ‌ద్ద జాతీయ జెండా ఎగుర‌వేసేందుకు బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నించ‌గా ఈ ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది.

73 ఏళ్ల కిందట సరిగ్గా ఇదేరోజున 1947లో అక్టోబర్ 26న భారత్‌లో కశ్మీర్ విలీనం అయ్యింది. జమ్ముకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ ఒప్పంద పత్రాలపై అప్పటి పాలకుడు మహారాజా హరిసింగ్ సంతకాలు చేశారు. దీన్ని పుర‌స్క‌రించుకొని బీజేపీ కార్య‌క‌ర్త‌లు లాక్‌చౌక్ వ‌ద్ద క్లాక్ ట‌వర్ స‌మీపంలో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు తోపులాట జ‌రిగింది. అనంత‌రం పోలీసులు బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు.

రక్షణ, విదేశీ అంశాల్లో భారత్‌కు అధికారమిస్తూ.. మిగిలిన అంశాల్లో కశ్మీర్‌కు స్వతంత్రత కల్పిస్తూ అప్ప‌ట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా జమ్ముక‌శ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఇటీవ‌ల త్రివ‌ర్ణ ప‌తాకంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామన్నారు. అప్పటి వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయనన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్య‌ల‌ను అంద‌రూ ఖండించారు. దీనికి ధీటుగా బీజేపీ స‌మాధానం ఇచ్చింది. ఈ భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించడం.. జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక జెండాను ఎగరవేయడం చేయలేవని బీజేపీ నేత‌లు అన్నారు.

న జెండా, దేశం, మాతృభూమి కోసం ఎందరో రక్తం చిందించారని, జమ్ము కశ్మీర్‌ ఈ దేశంలో అంతర్భాగమ‌న్నారు. ఇక్క‌డ త్రివ‌ర్ణ ప‌తాకం మాత్ర‌మే ఎగురుతుంద‌న్నారు. కాగా నేడు త్రివ‌ర్ణ ప‌తాకం ఎగుర‌వేసే క్ర‌మంలోనే పోలీసుల‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు వివాదం నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here