తొలిసారి కాబోయే వాడి ఫొటోను షేర్‌ చేసిన కాజల్‌..

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ మరికొన్ని రోజుల్లోనే పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును ఈనెల 30న వివాహాం చేసుకోనున్నారు. ఇక కరోనా కారణంగా అత్యంత సన్నిహితుల నడుమ కాజల్‌ అగర్వాల్‌ ఇంట్లోనే వివాహ తంతును జరిపించడానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇదిలా ఉంటే గత నెల రోజులుగా కాజల్‌వివాహానికి సంబంధించి వార్తలు వస్తున్నా.. కాజల్‌ మాత్రం ఒక్కసారి కూడా తన కాబోయే భర్త ఫొటోను అభమానులతో పంచుకోలేదు.

దీంతో తాజాగా దసరాను పురస్కరించుకొని తనకు కాబోయే వరుడు గౌతమ్‌ కిచ్లుతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిందీ బ్యూటీ. ఈ ఫొటోలో కొత్త జంట నవ్వుతూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫొటోతో పాటు..‘మా తరఫున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు’ అని క్యాప్షన్‌ను జోడించిందీ అందాల తార.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here