స‌రిహ‌ద్దులో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రం.. సిద్ధంగా ఆర్మీ

భార‌త్ చైనా మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇది చాలా రోజులుగా ఉన్న‌ప్ప‌టికీ ప‌రిస్థితులు మాత్రం ఇప్పుడు కాస్త ఆందోళ‌న‌క‌రంగానే క‌నిపిస్తున్నాయి. ఇందుకు సమాధానంగా ఆర్మీ చీఫ్ వ్యాఖ్య‌లే మ‌నం చెప్పుకోవ‌చ్చు.

ఇండియ‌న్ ఆర్మీ చీఫ్ మ‌నోజ్ ముకుంద్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చీనీయాంశంగా మారాయి. భార‌త్ చైనా స‌రిహ‌ద్దులో ప‌రిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. భార‌త జ‌వాన్లు సిద్ధంగా ఉన్నార‌న్నారు. మ‌రోవైపు చైనాతో భార‌త్ చ‌ర్చ‌లు జ‌రుపుతూనే ఉంది. వారం రోజుల నుంచి సైనికాధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

అయితే దాదాపు కొన్ని నెల‌ల నుంచి భార‌త్ చైనాతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ప్ప‌టికీ చైనా వైఖ‌రి మాత్రం మార‌డం లేదు. ఒక‌వైపు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా మరో వైపు స‌రిహ‌ద్దులో త‌న బ‌ల‌గాల‌ను చైనా మొహ‌రిస్తూనే ఉంది. అయితే ఈశాన్య ల‌ద్దాక్‌లోపాంగాంగ్ స‌ర‌స్సు స‌మీపంలో ఆర్మీ చీఫ్ ప‌ర్య‌టించారు. ఈ   ప్రాంతంలో చైనా ఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇక్క‌డ ప‌ర్య‌టించి ప‌రిస్థితిని స‌మీక్షించారు.

వాస్త‌వాధీన రేఖ వెంట ప‌రిస్థితులు ఉద్రిక్తంగానే క‌నిపిస్తున్నాయ‌ని ఆయ‌న కామెంట్ చేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే అక్క‌డ ప‌రిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ ఆర్మీ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here