సరిహద్దులో క్షణ క్షణం ఉత్కంఠ.. యుద్ధం వైపు సంకేతాలు

ఇండియా, భార‌త్ మ‌ధ్య కొన్ని నెల‌లుగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. స‌రిహ‌ద్దులో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ఆందోళ‌న నెల‌కొంది. తాజాగా చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును చూస్తుంటే.. యుద్ధం జ‌రుగుతుందా అనిపిస్తోంది.

స‌రిహ‌ద్దులో పాంగాంగ్ స‌రస్సు వ‌ద్ద చైనా భారీగా బ‌ల‌గాల‌ను మొహ‌రించింది. బ‌రిసెలు, ఇనుప ముళ్ల‌తో కూడిన బ‌ర్రెలు, ప‌దునైన క‌త్తుల్లాంటి ఆయుధాల‌తో భార‌త్‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. తూర్పు ల‌ద్దాక్‌లో 50 వేల మంది సైనికులు, 150 యుద్ధ విమానాలు మొహ‌రించిన‌ట్లు తెలుస్తోంది. పాంగాంగ్‌కు ద‌క్షిణాన ప‌లు ప్రాంతాల్లో చైనా భార‌త్ బ‌ల‌గాలు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ఇరు దేశాల బ‌ల‌గాల మ‌ధ్య దూరం కేవ‌లం రెండు వంద‌ల మీట‌ర్లే ఉంది.

అయితే చైనాకు ధీటుగా భార‌త సైన్యం కూడా సిద్ధంగా ఉంది. ఎల్‌.ఏ.సికి స‌మీపంలో యుద్ధ విమానాల‌ను తిప్పుతూ ఏం జ‌రుగుతుందో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూనే ఉంది. అయితే ఈ ప‌రిస్థితులు పూర్తి స్థాయి ఘ‌ర్ష‌ణ‌గా మారే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలే చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ యుద్ధం త‌లెత్తే అవ‌కాశం మాత్రం లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న ఈ ఉద్రిక్త ప‌రిస్థితులు మ‌రికొన్ని నెల‌ల పాటు కొనసాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి చైనా వ్య‌వ‌హారిశైలిపైనే ప‌రిస్థితులు చ‌ల్ల‌బ‌డ‌తాయా లేదా అన్న‌ది ఆధార‌ప‌డి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here