సాహో సినిమాలో ఆ సీన్ ఏ కీలకం !

బాహుబలి  సినిమాతో భారతదేశంలో అన్నీ ఇండస్ట్రీ రికార్డులను పగలగొట్టిన  ప్రభాస్ , ఇప్పుడు సాహో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో బాహుబలి లాంటి భారీ హిట్ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  150 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతోంది .ప్రభాస్ ఈ చిత్రంలో గత చిత్రాలకు భిన్నంగా కనిపిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.సాహో సినిమా డైరెక్టర్ సుజిత్ ఈ ప్రాజెక్టుతో టాప్ డైరెక్టర్ల లిస్టు లో చేరిపోవడం ఖాయం అంటున్నారు సినీవర్గాల వారు .సినిమా రిజల్ట్ బాగుండాలని దర్శకుడు  సుజిత్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. సాహో సినిమాలో యాక్షన్ పార్ట్ కోసం చిత్ర బృందం దుబాయ్ టూర్ కు ప్లాన్ చేసింది…  అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పై యాక్షను పార్ట్  చిత్రీకరణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్ని బేట్స్ నేతృత్వంలో చేయనున్నారు .

ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతుంది. అయితే హైదరాబాదులో కొన్ని సన్నివేశాల షూటింగ్ మిగిలిపోవడం తో దుబాయ్ టూర్ వాయిదా పడింది.సాహో సినిమా లో  ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2018 లో సాహో సినిమా రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here