పవన్ పక్కన కనపడింది అంతే .. ఈ హీరోయిన్ కి విపరీతమైన డిమాండ్

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచమైన గ్లామర్ కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాలమైన కళ్లతో .. ఆకర్షణీయమైన నవ్వుతో ఈ అమ్మడు పొలోమంటూ కుర్రకారు మనసులను దోచేస్తోంది. కెరియర్ ఆరంభంలోనే పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిందంటే మాటలా మరి. పవన్ జోడీగా ఈ అమ్మాయి చేసిన ‘అజ్ఞాతవాసి’ విడుదల కాకముందే, వరుస అవకాశాలు వచ్చేస్తున్నాయి. ఈ సినిమా హిట్ కొడితే అమ్మాయి ఒక రేంజ్ లో దూసుకెళుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
 పవన్ సరసన నటించిన ఈ సుందరి, బన్నీ జోడీగా ‘నా పేరు సూర్య’ చేస్తోంది. చరణ్ – బోయపాటి కాంబినేషన్లోని సినిమాలోనూ ఈ అమ్మాయినే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేయనున్న సినిమా కోసం కూడా ఈ అమ్మాయినే అడిగారట. ఇందుకోసం అమ్మడు పారితోషికంగా భారీ మొత్తమే అడిగిందని టాక్. ఇక మారుతి – నాగ చైతన్య సినిమాలోనూ అనూ ఇమ్మాన్యుయేల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here