వర్ణ వివక్షపై పోరాడే యువతిగా ఇలియానా.!

మనిషి చర్మం రంగుపై ఎప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఏ మూలకు వెళ్లిన ఈ జాడ్యం ఉండే ఉంటుంది. అయితే దీన్నే కథాంశంగా తీసుకొని ఓ సినిమా తెరకెక్కనుంది. అందమంటే తెల్లని రంగే అని భ్రమించే సమాజంలో ఓ అమ్మాయి ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ‘అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా నటిస్తోంది.

రయిత బల్వీందర్‌ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. ఆయన గతంలో ఇలియాన నటించిన ‘ముబారకాన్‌’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. హర్యానా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వర్ణ వివక్షపై పోరాడే యువతి పాత్రలో ఇలియానా నటించనుంది. ఇక ఈ సినిమా గురించి ఇలియానా మాట్లాడుతూ.. ‘అమ్మాయి తెల్లగానే ఉండాలన్నది పాత మాట.. ఇప్పుడు ‘అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ అనేది కొత్త మాట. ఒక బలమైన పాయింట్‌తో దర్శకుడు ఈ కథను తయారు చేశారు. అయితే కేవలం రంగు గురించి సందేశాత్మక బోధనలు వినిపించినట్లుగా కాకుండా.. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఓ మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. గత కొన్ని రోజులుగా సరైన విజయంలేక సతమతమవుతోన్న ఇలియానాకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను ఇస్తుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here