2021 న్యూ ఇయ‌ర్ వేడుక‌లు చేసుకోవాల‌నుకుంటే ముందుగా ఇది చేయాలి..

కొత్త సంవ‌త్స‌రంలో వేడుక‌లు చేసుకోవడం కామ‌న్‌. అయితే ఇప్పుడు ఆ వేడుక‌ల‌కు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి అంటున్నారు కొంద‌రు. 2020 క‌రోనాతో గ‌డిచిపోతోంది. ఇప్పుడు కొత్త సంవ‌త్స‌రంలో కూడా ఈ వ్యాధికి భ‌య‌ప‌డి జ‌నాలు కొత్త నిబంధ‌న‌లు పెడుతున్నారు.

కరోనా కాలంలో ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతాలైన మసూరీ, నైనిటాల్ మొదలైన ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మసూరీలోని హోటళ్లలో 40 శాతం వరకూ బుకింగ్స్ ఇప్పటికే అయ్యాయి. మరోవైపు మసూరీ, నైనిటిల్‌లకు వచ్చే పర్యాటకులకు కరోనా టెస్టులు చేసిన తరువాతే ప్రవేశం కల్పిస్తారు. అయితే అప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్ష‌లు చేస్తారా లేదా ఇటీవ‌ల ప‌రీక్ష‌లు చేయించుకున్న రిపోర్టు ఉంటే స‌రిపోతుందా అన్న‌ది తెలియాల్సి ఉంది.

అయితే దీనిపై ఇంకా హైకోర్టు నుంచి ఆదేశాలు రావాల్సివుంది. తాజాగా మసూరీలో 151 మందికి కరోనా టెస్టులు చేయించగా, వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఇదేవిధంగా పర్యాటక స్థలాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్నవారికి పోలీసులు చలానాలు విధిస్తున్నారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రాణా మాట్లాడుతూ మూసూరీలో ప్రతీరోజూ కోరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకూ ఈ ప్రాంతంలో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. కాగా ఇక్కడి హోటళ్లలో డిసెంబరు 25 నుంచి 31 వరకూ బుకింగ్స్ జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here