” అలా చేసుంటే జగన్ ఈ పాటికి సీఎం అయిపోయేవాడు .. “

అమలు చెయ్యడానికి కాస్తంత కూడా అవకాశం లేని హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో జనాలని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు వైకాపా నేత భూమాన కరుణాకర్ రెడ్డి. ” అచ్చంగా అదే అబద్ధాలు జగన్ మోహన్ రెడ్డి చెప్పి ఉంటె ఆయన ముఖ్యమంత్రి అయిపోయేవాడు . కొంతమంది జగన్ ని దొంగ హామీలు చెయ్యమని కోరినా జగన్ అలా చెయ్యలేదు. అది ఆయన లోని నిజాయతీ కి నిదర్సనం. బాబులాగా కాళ్ళ బొల్లి మాటలు చెబితే ఈ పాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అయ్యి కూర్చునేవాడు ” అన్నారు ఆయన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ప్లీనరీ ప్రారంభం కాగా, భూమన మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ జనాలకి మంచి జరగాలి అంటే తమకి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ జగన్ మాత్రమే అని ఆయన చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here