రజినీకాంత్ ఎక్కిన కారు కావాలని పట్టు బడుతున్న మహింద్రా ఓనర్ :

మహేంద్రా గ్రూప్ చైర్మన్ , ప్రముఖ ఇండస్త్రియలిస్ట్ ఆనంద్ మహింద్రా అందరికీ తెలిసిన వారే , తన సంస్థ కి చెందిన ఒక కారు ని ఆయన కొనుక్కోకుండా కాలీవుడ్ హీరో ధనుస్ ని అడగడం విశేషం. ఆయన కంపెనీ కారు ధనుష్ దగ్గర ఉండడం ఇంతా అనుకుంటున్నారా ? ఆయన కోరింది మహింద్రా కంపెనీ కారునే కానీ ఆల్రెడీ అమ్మేసిన కారుని పైగా అది రజినీకాంత్ వాడుతున్న కారు.  ధనుష్ నిర్మాతగా పా.రంజిత్ రూపొందిస్తున్న ‘కాలా’ సినిమా పోస్టర్‌ ను చూశారా? ఆ పోస్టర్ లో రజనీ మహీంద్రా సంస్థకు చెందిన ‘థార్‌’ జీపుపై స్టైల్‌ గా కూర్చొని ఠీవిగా ఉంటారు.

ఆ ఫోటో , మహీంద్రా బండి చూసిన ఆనంద్ చాలా సంతోష పడ్డారు. ఆ కారు ని తమ కంపెనీ మ్యూజియం లో పెట్టడం కొసం తన దగ్గరకి పంపాలని ఆయన ధనుష్ ని కోరారు. ఈ సందర్భంగా ‘సూపర్‌ స్టార్‌ రజనీ లాంటి లెజెండ్‌ కారుని సింహాసనంలా వాడుకుంటే.. కారు కూడా లెజెండ్‌ అయిపోతుంది’ అని ట్వీట్‌ చేశారు. ధనుష్ ఆయనకి ఆన్సర్ కూడా ఇచ్చాడు.  ‘చాలా థ్యాంక్స్‌ సర్‌. ప్రస్తుతం కారుని చిత్రీకరణ కోసం వాడుతున్నాం. అయిపోగానే మీకు పంపే ఏర్పాట్లు చేస్తాం.’ అని ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here