బెల్లం కొండ తెలివితేటలు బాబోయ్ అదుర్స్ :

కేవలం మొట్టమొదటి సినిమాకి వినాయక్ లాంటి డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ , సమంత హీరోయిన్ లని పెట్టుకున్న బెల్లం కొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను తో మన ముందుకి వచ్చి పరవాలేదు అనిపించే అవుట్ పుట్ ని ఇచ్చాడు. బయ్యర్ లు కూడా ఈ సినిమాతో సేఫ్ గానే బయట పడ్డారు అని చెప్పచ్చు. ఆ తరవాత సినిమా ప్లాప్ అయినా మూడవ సినిమాకి మళ్ళీ భారీ గా రాబోతున్నాడు మనోడు.

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తదుపరి చిత్రం విషయం లో మాత్రం స్టార్ డైరెక్టర్ ని పక్కకి పెట్టి శ్రీవాస్ ని హీరోగా పెట్టి సినిమా తీసే ప్లాన్ చేస్తున్నాడు. డైరెక్టర్ నీ హీరోయిన్ ని కొత్తవాళ్ళని , తక్కువ బడ్జెట్ లో పెట్టుకుని మ్యూజిక్ మాత్రం దేవీ ని పెట్టుకుని బడ్జెట్ కటింగ్ మొదలెట్టాడు.

బోయపాటి శ్రీను సినిమా పూర్తయిన తర్వాత జూన్‌లో ఈ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారు. బోయపాటి శ్రీను సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్‌కి హీరోగా ఒక బేస్‌ ఏర్పడుతుందని, ఇక అన్ని సినిమాలకీ భారీ ప్యాడింగ్‌ అవసరం లేకుండా నెగ్గుకు రాగలడని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here