రాజమౌళి కళ్ళు నెత్తికి ఎక్కాయి .. ఎన్టీఆర్ ఫాన్స్ పిచ్చ కోపం

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో రాజమౌళి మాట్లాడిన తీరు అతని ఇదివరకటి మాట తీరు కి చాలా తేడా ఉంది అంటున్నారు అతని సన్నిహితులు, విశ్లేషకులు, రాజమౌళి తనలోని సున్నిత కోణాన్ని ఈ ప్రోగ్రాం లో బయట పెట్టాడు. మగధీర , సింహాద్రి సినిమాల సెంటర్ ల విషయం లో అనేక సీక్రెట్ లు బయట పెట్టిన మౌళి అతని కాపీ మాస్టర్ విషయాలు మాత్రం మాట్లాడకపోవడం , ఆర్కే కూడా ఆ విషయాలు అడక్కపోవడం ఆశ్చర్యకరం. మగధీర లాంటి సినిమాలో హాలీవుడ్ షాట్ లు యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టేసిన రాజమౌళి దానికంటే ముందర ఛత్రపతి , విక్రమార్కుడు , సై లాంటి సినిమాల్లో తన కాపీ ప్రయత్నాలు గట్టిగా చేసాడు.

మర్యాద రామన్న సినిమాని హాస్పిటాలిటీ చిత్రం నుంచి కాపీ లేపెసాడు. అతని ప్రముఖ చిత్రం ఈగ లో కూడా కాపీ సీన్ లు బోలెడు. మొన్నటికి మొన్న వచ్చి సంచలనం సృష్టించిన బాహుబలి లో కూడా అనేకం కాపీ ఉన్నాయి మరి. ఆ లెక్కన చూసుకుంటే అగ్ర నిర్మాత అల్లూ అరవింద్ గురించీ , ఎన్టీఆర్ సినిమా సింహాద్రి గురించీ కామెంట్ చేసే ముందర రాజమౌళి అవన్నీ ఆలోచించుకోవాలి కదా ? బాహుబలి సూపర్ బ్లాక్ బస్టర్ తో మౌళి కళ్ళు నెత్తికి ఎక్కాయి అని ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ లో కామెంట్ చేస్తూ ఉండడం విశేషం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here