రారండోయ్ వేడుక చూద్దాం .. హిట్టు సినిమా .. లెక్క ఇదే :

మొదటి మూడు రోజులు హడావిడి చెయ్యడం ఆ తరవాత పరిస్థితి సర్దు మణిగి పోయే సినిమాలు ఎక్కువగా చూస్తున్నాం. అలాగే అవుతుంది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పరిస్థితి కూడా అనుకున్నారు అందరూ కానీ ఈ సినిమా నెమ్మది నెమ్మదిగా ఫామిలీ జనాలకి కనక్ట్ అయ్యింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదని సోమ, మంగళవారాల కలక్షన్లు చెబుతున్నాయి.
ఆదివారం నుంచి సోమవారంకి భారీ డ్రాప్‌ లేకపోవడంతో బయ్యర్లు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం వసూళ్లు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి మంగళవారం నాడు ఏ సినిమా అయినా డ్రాప్ లు లేకుండా హౌస్ ఫుల్స్ తెచ్చుకుంటే ఆ సినిమా ఇక కోటానుకోట్ల షేర్ ఇస్తుంది అని ట్రేడ్ వర్గాల నమ్మకం. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రమారమి పన్నెండున్నర కోట్ల షేర్‌ సాధించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సెకండ్‌ వీకెండ్‌కి ఇరవై కోట్ల షేర్‌ మార్కుని అవలీలగా దాటేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here