విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఐఎఎస్ దంప‌తులు..

దేశంలో అత్యున్న‌త‌మైన ఐఎఎస్ స్థాయిలో ఉన్న వారు విడాకుల కోరుకోవ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇద్ద‌రు ఐఎఎస్‌లు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇద్ద‌రూ విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో వీరి విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే అది వారి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మ‌ని ప‌లువురు లైట్ తీసుకుంటున్నారు.

టీనాడాబీ, అథర్ అమీర్ ఖాన్ లు ఫ్యామిలీ కోర్టులో సమర్పించిన విడాకుల పిటిషన్ లో కోరారు. 2016 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులు 2018లో వివాహం చేసుకున్నారు. టీనా డాబీ 2015 యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల్లో టాపర్ గా నిలిచారు. కశ్మీరుకు చెందిన అథర్ ఆ పరీక్షల్లో రెండోస్థానంలో నిలిచారు. వీరిద్దరూ రాజస్థాన్ కేడర్ అధికారులు. శిక్షణ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని , దీంతో వీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. విడాకుల కోసం జైపూర్ లోని ఫ్యామిలీకోర్టు-1లో వీరిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు.

టీనా డాబీ సోషల్ మీడియా ఖాతాలో తన పేరులోని ఖాన్ ను తొలగించారు. అనంతరం అథర్ ఖాన్ కూడా తన ఇన్ స్టాగ్రాం నుంచి టీనా ఖాతాను అన్ ఫాలో చేశారు. యువ ఐఎఎస్ దంపతులు విడాకుల కోసం జైపూర్ లోని ఫ్యామిలీకోర్టు-1లో వీరిద్దరూ దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేపింది. గతంలో వీరిద్దరి ప్రేమ వివాహాన్ని లవ్ జిహాద్ గా హిందూ మహాసభ పేర్కొంది. టీనా ప్రస్థుతం రాజస్థాన్ రాష్ట్ర ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీగా, అమీర్ అథర్ ఈజీఎస్ సీఈవోగా పనిచేస్తున్నారు. కాగా దేశ అత్యున్న‌త స్థాయి సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో టాప‌ర్లుగా నిలిచిన వీళ్లు విడాకుల కోసం రావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. కాగా ఇత‌రుల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి మాట్లాడుకోవడం మంచిది కాద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here