క‌రోనా టీకాను ఎంత టైంలో క‌నిపెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..

క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచ దేశాల‌న్నీ ఎదురుచూస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు వ్యాక్సిన్‌ను త‌యారుచేశాయి. చాలా దేశాలు అత్య‌వ‌స‌రం నిమిత్తం క‌రోనా వ్యాక్సిన్ వాడుకుంటున్నాయి. ఇప్ప‌టికే ర‌ష్యా ఈ జాబితాలో ముందు వ‌రుసలో ఉంది. అయితే ఇటీవ‌లె అమెరికా కూడా క‌రోనా వ్యాక్సిన్‌కు అనుమ‌తులు ఇచ్చేసింది.

ఫార్మా కంపెనీ ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకాకు ఇటీవలే అమెరికాలో అనుమతి లభించింది. అంతకుమునుపే బ్రిటన్ ఈ టీకాకు ఎమర్జెన్సీ ఆథొరైజేషన్ ఇవ్వడంతోపాటూ..టీకా పంపిణీ కూడా ప్రారంభించింది. అయితే..ఈ ఎమ్‌ఆర్ఎన్ఏ టీకా డిజైన్ జనవరిలోనే పూర్తయినట్టు బయోఎన్‌టెక్ సహవ్యవస్థాపకుడు ఉగుర్ సాహిన్ తెలిపారు. తాను ఈ టీకాను కేవలం రెండు గంటల్లోనే డిజైన్ చేసినట్టు తెలిపారు. గతంలో మోడర్నా కూడా ఇంచుమించు ఇదే తరహా ప్రకటన చేసింది. తమ టీకా డిజైన్ రెండు రోజుల్లోనే పూర్తైందని తెలిపింది.

టీకా రూపకల్పనలో ఇంతటి వేగానికి కారణం.. శాస్త్రవేత్తలు వినియోగించిన టెక్నాలజీయే అని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండూ ఎమ్‌ఆర్ఎన్ సాంకేతికత ఆధారంగా తయారయ్యాయి. వీటిని డిజైన్ చేసేందుకు కరోనా వైరస్ జన్యుక్రమం తెలిస్తే చాలు. శాస్త్రవేత్తలకు ఇది ముందే తెలియడంతో వారు సునాయశంగా టీకాను డిజైన్ చేశారు. ఇక ఇండియాలో కూడా ఇప్ప‌టికే క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ మూడో ద‌శ‌కు చేరుకున్నాయి. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం మానిట‌రింగ్ చేస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వ‌చ్చినా ప్ర‌జ‌ల‌కు అంద‌జేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here