అల్లు అర్జున్ ట్వీట్ ఎప్పుడు మర్చిపోలేను: ప్రియా ప్రకాశ్ వారియర్‌

దేశంలో సోషల్ మీడియాలో తన కనుబొమ్మల హావభావాలతో సునామీ సృష్టించిన  ప్రియా ప్రకాశ్ వారియర్‌ మంచి పాపులారిటీ సంపాదించుకుంది దేశం మొత్తంమీద. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి ప్రేక్షకులే కాక చాలామంది ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. అటువంటి ప్రముఖులలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. మలయాళ సినీ పరిశ్రమలో అల్లు అర్జున్‌కి చాలా పాప్యులారిటీ ఉంది. స్టైలిష్ స్టార్ చేసిన ట్వీట్‌పై ప్రియా ప్రకాశ్ హర్షం వ్యక్తం చేసింది.

ఇదిలావుండగా పాపులర్ ఐన వీడియో లో నటించిన ప్రియా ప్రకాశ్ వారియర్‌, సహనటుడు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియా మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ  మర్చిపోలేనని తెలిపింది. అభిమానుల నుంచి తనకు ఇంతటి ఆదరణ లభించినా, అల్లు అర్జున్‌ ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా ప్రత్యేకమైనదని, తమ రాష్ట్రంలో ఆయనకు అభిమానులు ఎక్కువని చెప్పింది. దీంతో కేరళలో ఉన్న మాల్లు అర్జున్ ఫాన్స్ తో పటు టాలీవుడ్ లో ఉన్న అల్లు అర్జున్ ఫాన్స్ కూడా అమ్మడు ఇచ్చిన స్టేట్మెంట్ కి తెగ సంతోషపడిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here