ప‌వ‌న్ క‌ల్యాణ్ వార్త‌లో నిజ‌మెంత‌..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటు రాజ‌కీయాల‌తో పాటు సినిమాల్లో కూడా బిజీ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తున్నారు. ఆ త‌ర్వాత క్రిష్ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నారు ప‌వ‌న్‌.

ప‌వ‌న్ ఇప్పుడు మ‌రో సూప‌ర్ హిట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌ల‌యాళ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కొషియ‌మ్ సినిమాలో ఆయ‌న న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలో విడుద‌లై మంచి హిట్ సొంతం చేసుకుంది. దీంతో అన్ని భాష‌ల్లో ఈ సినిమాను రీమేక్ చేస్తార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగులో కూడా బాల‌య్య‌, ర‌వితేజ రానా న‌టిస్తార‌ని అప్ప‌ట్లో పుకార్లు వ‌చ్చినా అవి నిజం కాలేదు.

తెలుగు ఇండ‌స్ట్రీ విష‌యానికి వ‌స్తే సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఈ సినిమా హ‌క్కుల్ని తీసుకుంది. దీంతో ఈ సినిమాను ప‌వ‌ర్ స్టార్‌తో చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారంట‌. ఇప్ప‌టికే ఈ సినిమాను ప‌వ‌న్ ఓ సారి చూశార‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఈ సినిమా బాధ్య‌త‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న ఓ డైరెక్ట‌ర్ చేతిలో పెట్టార‌ని ఇండ‌స్ట్రీలో ఓ టాక్ న‌డుస్తోంది. అయితే ఇంత‌వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి ఎవ్వ‌రూ క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఒక‌వేళ ప‌వ‌న్ ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నా.. వ‌కీల్‌సాబ్ పూర్తి చేసిన త‌ర్వాత క్రిష్ సినిమా చేసిన అనంత‌రం ఈ సినిమా చెయ్యాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here