కేజ్రీవాల్‌పై మండిప‌డ్డ గౌత‌మ్‌ గంభీర్‌..

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షానికి లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్టాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.  అయితే ఇదే స‌మ‌యంలో ఇండియా మాజీ క్రికెట‌ర్‌, ఎంపీ గౌత‌మ్ గంభీర్ గ‌రం గ‌రం వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీని తుగ్ల‌క్ పాలిస్తున్నార‌న్నారు గంభీర్‌.

అస‌లు ఏమైందంటే.. గౌత‌మ్ గంభీర్ ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఇందులో వాన నీటితో నిండిన ఢిల్లీ వీధుల్లో ఓ ఓంటెద్దు బండి వెళుతోంది. ఈ బండిమీద 10 నుంచి 15 మంది ఉంటారు. నీళ్ల‌లో మునిగిన ఆ బండి కాస్త దూరం వెళ్లిపోయిన అనంతం బ్యాలెన్స్ త‌ప్పి ప‌డిపోతుంది.ఈ క్ర‌మంలో కింద ప‌డ్డ వారిని ప‌ట్టించుకోకుండా ఆ బండి ముందుకు వెళ్లిపోతుంది.

ఈ వీడియోను పోస్టు చేసిన గంభీర్ కేజ్రీవాల్‌పై మండిప‌డ్డారు. ఈ వీడియోలో క‌న్పిస్తున్నది 14వ శతాబ్దంలో తుగ్ల‌క్ పాలించిన ఢిల్లీ కాద‌ని.. 21వ శతాబ్దంలో తుగ్ల‌క్ పాలించిన ఢిల్లీ అన్నారు. వ‌ర్షం నీటిలో మునిగిన కాల‌నీల ప‌రిస్థితిని ఉద్దేశంచి ఆయ‌న ఇలా మాట్లాడారు. ఇక ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. జ‌కీరాలో కారు, బ‌స్సు, ఆటో నీటిలో మునిగిపోగా.. కారు, ఆటోను స్థానికులు బ‌య‌ట‌కు తీశారు. బ‌స్సును మాత్రం తీయ‌లేక‌పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here