కాజ‌ల్ హ‌నీమూన్ వెళ్లిపోతే సినిమాలు ఎలా..

హీరోయిన్ కాజ‌ల్ సినిమాలు చేస్తుందా లేదా అన్న దానిపై ఫ్యాన్స్ ఆందోళ‌న‌గా ఉన్నారు. ఆచార్య షూటింగ్‌లో ఆమె పాల్గొనాల్సి ఉంది. ఇప్పుడు స‌డెన్‌గా ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. దీంతో మ‌రి కొద్ది రోజుల త‌ర్వాత కాజ‌ల్ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

ప్ర‌ముఖ హీరోయిన్ ముద్దుగుమ్మ కాజ‌ల్ బిజీ అయిపోయింది. కాజల్‌ గత నెల 30న తన ప్రేమికుడు, పారిశ్రామిక వేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ స‌భ్యులు అత్యంత ద‌గ్గ‌రి వాళ్ల స‌మ‌క్షంలో కాజ‌ల్ పెళ్లి జ‌రిగింది. క‌రోనా ఉన్న నేప‌థ్యంలో ఇలా పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది. కాగా ఇప్పుడు కాజ‌ల్ హ‌నీమూన్ వెళ్లేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇన్‌స్టగ్రామ్‌లో ఆమె బ్యాగ్గులు, పాస్‌పోర్టుల ఫోటోలు పెట్టింది. బ్యాగులు స‌ర్దేసుకున్నాం.. రెడీ టు గో అంటూ విమానం ఎమోజీలు పెట్టింది. దీన్ని బ‌ట్టి కాజ‌ల్ హ‌నీమూన్ వెళ్లేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. కాగా మొన్న మొద‌టి కార్వా చౌత్‌ని చేసుకున్న కాజ‌ల్ ఉప‌వాసం కూడా ఉంది. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత `ఆచార్య` షూటింగ్‌కు కాజల్ హాజరుకాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here