ఆయ‌న స్టైలే వేరు.. న‌గ్నంగా దొంగ‌త‌నానికి వెళ‌తాడు..

అదేదో సినిమాలో మ‌నం చూశాం. ఒంటిపై బ‌ట్ట‌లు లేకుండా శ‌రీరం మొత్తం ఆయిల్ పూసుకొని దొంగ‌త‌నానికి వెళ‌తాడు ఓ దొంగ‌. అదేంట‌ని అడిగితే ఎవ‌రైనా ప‌ట్టుకుంటే దొర‌కుండా జారిపోవాల‌ని ఇలా వ‌చ్చాన‌ని చెబుతాడు. అచ్చంగా అదే స్టైల్లో దొంగ‌త‌నం చేస్తున్నాడు ఓ రియ‌ల్ దొంగ‌. అయితే ఈయ‌న‌ది కాస్ట డిఫ‌రెంట్ స్టైల్‌.

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన మోహ‌న్‌రావు పాత నేర‌స్తుడు. ఇత‌డు గ‌తంలోనే ప‌లు దొంగ‌త‌నాల కేసుల్లో అరెస్టై జైలు శిక్ష కూడా అనుభ‌వించాడు. ఇత‌నికి అన‌కాప‌ల్లి మండ‌లం త‌మ్మ‌య్య‌పేట వెంక‌ట‌పాలెంకు చెందిన సంతోష్ కుమార్ జ‌త‌య్యాడు. ఇద్ద‌రూ క‌లిసి జంట‌గా దొంగ‌త‌నాల‌కు వెళ్లేవారు. అయితే సంతోష్ కుమార్ బైక్ డ్రైవ్ చేస్తే మోహ‌న రావు దొంగ‌త‌నం చేసేవాడు.

మోహ‌న్‌రావు దొంగ‌త‌నం చేసే స‌మ‌యంలో బైక్ దిగిన వెంట‌నే త‌న ఒంటిమీద బ‌ట్ట‌లేమి లేకుండా వెళ‌తాడు. ఒక్కోసారి డ్రాయ‌ర్ మాత్ర‌మే వేసుకొని వెళ‌తాడు. ఇలా న‌గ్నంగా వెళ్లి 60 సార్లు దొంగ‌త‌నాలు చేశాడు. దువ్వాడ‌, ఎయిర్‌పోర్టు, ఆన‌కాప‌ల్లి, క‌శీంపేట ప‌రిధిలో వ‌రుస చోరీలు జ‌రిగాయి. దీంతో పోలీసులు ఈ కేసుల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తే ఓ వ్య‌క్తి న‌గ్నంగా ఇళ్ల‌లోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు క‌నిపించింది. దీంతో అత‌న్ని పోలీసులు ప‌ట్టుకున్నారు.

అయితే న‌గ్నంగా వెళ్లేందుకు కార‌ణం చెప్ప‌గానే పోలీసులు కూడా అవాక్క‌య్యైన‌ట్లు తెలుస్తోంది. ఇలా తాను దొంగ‌త‌నం చేసేందుకు వెళ్ల‌డాన్ని ఎవ‌రైనా చూస్తే సైకోనో, లేక మాన‌సిక రోగో అనుకునేలా ఇలా వెళ్తాన‌ని ఆ దొంగ చెప్పాడు. సైకోను చూసి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేందుకు చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. ఈ లోపు అక్క‌డి నుంచి త‌ప్పించుకొని పారిపోవ‌చ్చ‌న్న ఉద్దేశంతో ఇలా న‌గ్నంగా వెళ‌తాడ‌ని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here