మంచిని దాచి చెడును మాత్రమే హైలెట్ చేస్తున్నారు: అదితి

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి మొదలుపెడితే తాజాగా శాండిల్ వుడ్ వరకు డ్రగ్స్ అంశం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీని కొంత మంది తీవ్రంగా తప్పు పడుతుంటే, మరికొందరు మాత్రం.. అందరూ అలా ఉండరు అని, చెడు మాత్రమే కాదు మంచి కూడా ఉంటుందని ఇండస్ట్రీ కి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి నటి అదితి రావు హైదరి కూడా వచ్చి చేరింది.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..’ కరోనా సమయంలో ప్రజల కోసం చాలా మంది సినీ తారలు మంచి పనులు చేశారు. అయితే మంచిని దాచి కేవలం చెడు మాత్రమే హైలెట్ చేస్తున్నారు. దీంతో ప్రజలు దాని గురించి మాత్రమే మాట్లాడుతారు. కేవలం ప్రతికూలంగా కాకుండా సానుకూలత పై కూడా దృష్టిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు మేము ఏం మాట్లాడినా అందులో ఒక్క తప్పు పదం దొరికినా వెంటనే టార్గెట్ చేస్తారు. తప్పు మాట్లాడిన వారిపై అందరూ విమర్శలకు దిగుతారు.. అలాగని ఏం మాట్లాడకపోయినా తప్పు పడతారు. ప్రతీదానికి సినీ పరిశ్రమని టార్గెట్ చేస్తారా ‘ అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది అదితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here