ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి : ఉమ్మడి హైకోర్టు

ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీ లోకి వెళ్లిపోయిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యేల పై  అత్యున్నత న్యాయస్థానం ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేస్తూ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మీద చట్టపర చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ వ్యాజ్యం మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు ,ఏపీ అసెంబ్లీ కార్యదర్శి,న్యాయశాఖ కార్యదర్శి కి నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రిపదవులు కొనసాగుతున్న వారిపై అనర్హత వేటు వేయాలని ఆదేశించింది హైకోర్టు. ఈ సందర్భంగా స్పీకర్ ఈ విషయంలో స్పందించకపోతే హైకోర్టు  తెలుగు చేసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here