హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు హీరోయిన్ తాప్సీకి ఫైన్‌..

న‌గ‌రాల్లో టూ వీల‌ర్ డ్రైవింగ్ చేసే వాళ్లు క‌చ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల‌ని ప్ర‌భుత్వాలు నిబంధ‌న‌లు విధించాయి. దీంతో చాలా వ‌ర‌కు సిటీల్లో నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌చ్చితంగా జ‌రిమానాలు విధిస్తున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో సెల‌బ్రెటీలు త‌ప్పు చేస్తే ఇట్టే దొరికిపోతారు. ఇప్పుడు ఈ కోవ‌లోకే హీరోయిన్ తాప్సీ చేరింది.

ప్ర‌ముఖ‌ హీరోయిన్ తాప్సీకి ఫైన్ ప‌డింది. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ డ్రైవింగ్ చేసినందుకు ఆమెకు ఫైన్ వేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా తాను డ్రైవింగ్ చేశాన‌ని అందుకే ముంబై పోలీసులు జ‌రిమానా విధించార‌ని తాప్సీ తెలిపింది. కాగా అభిమానులు ఎవ్వ‌రూ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయ‌వ‌ద్ద‌ని తాప్సీ కోరింది. తాప్సీ ఇటీవ‌లె సినీ ఇండ‌స్ట్రీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. కొంత మంది హీరోల భార్య‌లు తాను అందంగా లేన‌ని ఇష్ట‌ప‌డేవారు కాద‌ని తెలిపింది. దీంతో త‌న స్థానంలో వేరే హీరోయిన్ల‌కు అవ‌కాశాలు ఇప్పించార‌ని చెప్పింది. ఒక సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్ కంటే నా ఇంట్రడక్షన్‌ సీన్‌ బాగా వచ్చిందని. దాంతో డైరెక్టర్‌కు చెప్పి ఆ హీరో నా సీన్‌ను మార్చేశాడని చెప్పింది. త‌న కామెంట్ల‌తో పాటు హెల్మెట్ ఫైన్‌తో తాప్సీ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here