నిజామాబాద్‌లో ముగ్గురితో క‌లిసి సాయి ప‌ల్ల‌వి ఏం చేసిందో తెలుసా..

క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సినిమాలు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులు ప్రారంభం అవుతున్నాయి. ఇదే వ‌రుస‌లో హీరో నాగ‌చైత‌న్య‌, హీరోయిన సాయి ప‌ల్ల‌వి జంట‌గా నటించిన చిత్రం కూడా ఉంది. ల‌వ్‌స్టోరీ అనే ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె పూర్త‌య్యింది.

నిజామాబాద్‌లో ఓ పాట‌ని చిత్రీక‌రించ‌డం ద్వారా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్బంగా హీరోయిన్ సాయిప‌ల్ల‌వితో పాటు, శేఖ‌ర్ క‌మ్ముల‌, కొరియోగ్రాఫర్ శేఖ‌ర్ మాస్ట‌ర్‌, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ సెలబ్రేట్ చేసుకుంటూ ఫొటో తీసుకున్నారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. అయితే ఈ సినిమాను థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావిస్తోంది. థియేట‌ర్లు ఓపెన్ అవ్వ‌గానే సినిమా రిలీజ్ అవ్వ‌నుంద‌న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here