ప‌వ‌న్ సినిమా కోసం హీరోయిన్ రెడీ..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా గురించి ఏ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చినా అభిమానుల‌కు పండ‌గే.. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం వ‌కీల్ సాబ్‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘వ‌కీల్‌సాబ్’ అంటూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా సినిమాలు ఆల‌స్యం అవుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క్రిష్ కూడా ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క్రిష్ కాంబినేష‌న్ ఎలా ఉండబోతోందో అన్న ఆత్రుత అభిమానుల్లో ఉంది. కోవిడ్ ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈ సినిమాను కూడా ప‌వ‌న్ పూర్తి చేసేసి ఉండేవాడు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాగా ఇప్పుడు ఆమె స్థానంలో నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ని అంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే నిధి అగ‌ర్వాల్ మంచి అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న‌ట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here