కొత్త అవతారమెత్తనున్న కళ్యాణి..!

‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు‘, ‘పెదబాబు’, ‘వసంతం’ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి కళ్యాణి. ఇక ఈ సినిమాల తర్వాత అడపా దడపా వెండితెరపై కనిపించిన కళ్యాణి.. తాజాగా పెద్దగా సినిమాల్లో నటించట్లేదు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ సూర్యకిరణ్‌ను వివాహం చేసుకున్న కళ్యాణి అనంతరం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక నటనకు కాస్త దూరంగా ఉంటూ వస్తోన్న కళ్యాణి తాజాగా డైరెక్టర్‌గా మారనుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఇందుకోసం కథను పూర్తిచేసుకుందని సమాచారం. కే2కే పిక్చర్స్‌ పేరుతో స్వయంగా బ్యానర్‌ను స్థాపించి స్వీయ దర్శకత్వంలో సినిమా చేయడానికి కళ్యాణి సిద్ధమవుతోందని టాక్‌. ఈ సినిమాలో రాజు గారి గదిలో నటించిన చేతన్‌ చీను హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలచేయనున్నారు. సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, భాస్కరపట్ల లాంటి రచయితలు ఈ సినిమాకు పాటలు రాయనున్నారని సమాచారం. మరి నటిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కళ్యాణి.. దర్శకత్వంలో ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here