నా స్థానంలో బోనీకపూర్ వచ్చారు: హీరో రాజశేఖర్

ప్రముఖ హీరోయిన్ అందాలను శ్రీదేవి మరణం సినీ ప్రేక్షక లోకాన్ని కలచివేసింది. వెండితెర మీద ఎంతో అద్భుతంగా హీరోయిన్ గా రాణించి..నిజజీవితంలో భార్యగా,తల్లిగా అద్భుతంగా రాణించింది శ్రీదేవి.హీరోయిన్ శ్రీదేవి నాలుగేళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఇటీవల తమ కుటుంబ సన్నిహితుల శుభకార్యానికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అటునుండి అటే స్వర్గలోకానికి వెళ్ళిపోయింది.
శ్రీదేవి దుబాయ్ దేశంలో హఠాత్తుగా గుండెపోటు రావడం తో మరణించింది. అయితే ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖులు శ్రీదేవి మరణంపట్ల తమ విచారణ వ్యక్తం చేయడం జరిగింది…ఈ నేపథ్యంలో సినీ నటుడు రాజశేఖర్ శ్రీదేవి మరణవార్త విని షాక్ అయ్యానని తెలిపారు. అంతేకాకుండా హీరో రాజశేఖర్ శ్రీదేవి కుటుంబంతో మంచి  సాన్నిహిత్య సంబంధం. రాజశేఖర్ తండ్రి పోలీస్ శ్రీదేవి తండ్రి లాయర్ ఈ నేపథ్యంలో వీరిద్దరూ తండ్రులు ఒకేచోట పనిచేయడం జరిగింది.
అంతేకాకుండా శ్రీదేవి హీరో రాజశేఖర్ కి దూరపు బంధుత్వం కూడా ఉండడంతో మంచి స్నేహితులుగా మారారని అన్నారు. శ్రీదేవి తల్లికి తానంటే బాగా ఇష్టమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీదేవిని పెళ్లి చేసుకొమ్మని తనను కోరారని ఆయన అన్నారు. అయితే ఆమె సినిమాల్లో ఉందన్న కారణంతో… తాను ఎమ్మెస్ చదవాలన్న కారణం చెప్పి, వివాహాన్ని తిరస్కరించారని రాజశేఖర్ తెలిపారు… నా స్థానంలో బోనీకపూర్ వచ్చారు..ఏదేమైనా ఎవరకి  రాసిపెట్టింది వారికి అదే జరిగింది అని అన్నారు రాజశేఖర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here